తెలంగాణ

telangana

ETV Bharat / city

వాలంటీరా మజాకా..​ వితంతు పింఛను కోసం భర్తను "చంపేసింది"..!

Live person recorded as dead: వితంతు పింఛను కోసం ఓ ఇల్లాలు.. భర్త బతికుండగానే మరణించినట్లు నమోదు చేయించింది. తాను గ్రామ వాలంటీర్​ కావడంతో వీఆర్వోతో కలిసి భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొంది వితంతు పింఛనుకు ప్రయత్నించింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భర్త.. తాను బతికే ఉన్నానని మొత్తుకుంటున్నాడు.. ఈ వ్యవహారం ఏంటో మీరూ చూడండి.

registered-as-dead-person-while-alive-in-kadapa
registered-as-dead-person-while-alive-in-kadapa

By

Published : May 12, 2022, 7:58 PM IST

Live person recorded as dead: ఏపీలోని వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బతికున్న వ్యక్తిని మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు.. మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు. అయితే.. తాను బతికే ఉన్నానని, తన భార్య గ్రామ సచివాలయ వాలంటీర్‌గా పని చేస్తున్నందున వీఆర్వోతో కలిసి మరణ ధ్రువీకరణ పత్రం పొంది వితంతు పింఛనుకు ప్రయత్నిస్తోందని బాధితుడు బళ్లారి సుభాహాన్‌ బాషా ఆరోపిస్తున్నాడు. తాను ప్రాణాలతోనే ఉన్నానని, తనకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు.

రాయచోటిలో ఓ మహిళను వివాహం చేసుకున్న బాధితుడికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. మనస్పర్థలతో భార్యాభర్తలు కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిశాడు సుభాహాన్ బాషా. అయితే.. రేషన్‌ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు.

దీంతో.. రేషన్ కార్డులో తన పేరు ఎలా తొలగించారా..? అని తెలుసుకునేందుకు.. రేషన్ కార్డు పొందిన రాయచోటికి వెళ్లి తహసీల్దార్‌ను కలిశాడు సుభాహాన్ బాషా. కొత్తపల్లి-3 గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయరెడ్డి లాగిన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. బాషా మరణించినట్లు నమోదై ఉండడాన్ని గుర్తించారు. దీంతో.. బాధితుడు సుభాహాన్ బాషా అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య కలెక్టరును కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details