తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల ఆగ్రహం.. చెప్పులు, రాళ్లు, కుర్చీలతో దాడి.. - మంత్రి మల్లారెడ్డిపై చెప్పులతో దాడి

Attack on Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రెడ్లు నిర్వహించిన ఓ కార్యక్రామానికి హజరైన మంత్రి.. ప్రసంగిస్తుండగా మధ్యలోనే చెప్పులు, రాళ్లు, నీళ్ల బాటిళ్లు, కుర్చీలు విసిరేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వెళ్లిపోయే క్రమంలోనూ.. రెడ్డి నేతలు కాన్వాయ్​పై దాడి చేశారు.

Reddy leaders Attack on Minister Mallareddy in Ghatkesar simhagarjana
Reddy leaders Attack on Minister Mallareddy in Ghatkesar simhagarjana

By

Published : May 29, 2022, 10:06 PM IST

మంత్రి మల్లారెడ్డిపై రెడ్ల ఆగ్రహం.. చెప్పులు, రాళ్లు, కుర్చీలతో దాడి..

Attack on Minister Mallareddy: మేడ్చల్ జిల్లా జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన సింహగర్జన కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా.. తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సభికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రి ప్రసంగాన్ని పలువురు నేతలు అడ్డుకున్నారు. మంత్రికి నిరసన వ్యక్తం చేశారు.

ప్రసంగంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి.. తెరాస సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో మళ్లీ తెరాస ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ను పొగుడుతూనే.. మంత్రి ఉపన్యాసం సాగింది. అయితే.. ప్రసంగంలో మంత్రి పదేపదే కేసీఆర్​, తెరాస గురించి ప్రస్తావించటంతో.. తీవ్ర ఆగ్రహంతో కుర్చీలు పైకి లేపి సభికులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న దళితబంధు లాగానే రెడ్లబంధు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 5 వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నినదించారు. అంతటితో ఆగకుండా.. మంత్రిపైకి చెప్పులు, రాళ్లు విసిరేసి గందరగోళం సృష్టించారు.

ఈ ఊహించని పరిణామంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభ నుంచి వెనుదిరిగారు. వెళ్లిపోయే క్రమంలోనూ మంత్రి కాన్వాయ్​పై రెడ్డి నేతలు దాడి చేశారు. కాన్వాయ్​ వెనుక పరుగులు తీస్తూ మరీ.. నీటి సీసాలు, కుర్చీలు, రాళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రి కాన్వాయ్‌కు రక్షణగా నిలిచారు. అతికష్టం మీద మంత్రి మల్లారెడ్డిని నిరసకారుల నుంచి తప్పించిన పోలీసులు.. సభా ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details