వినాయక చవితికి లడ్డూ వేలం పాటలో.. హైదరాబాద్లోని బాలాపూర్ గణేషుడి లడ్డూ(BALAPUR LADDU) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏటా రికార్డు ధరకు గణనాథుని ప్రసాదం వేలం జరుగుతుంది. ఈసారి దానిని ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సొంతం చేసుకున్నారు.
BALAPUR LADDU: ఏపీ సీఎం జగన్కు బాలాపూర్ లడ్డూ అందజేత
బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్న ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ దానిని మంగళవారం ఆ రాష్ట్ర సీఎం జగన్కు (BALAPUR LADDU TO CM JAGAN) అందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.
బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ గణేషుడి లడ్డూను వేలం పాటలో రూ. 18.90 లక్షలకు సొంతం చేసుకున్న రమేశ్ యాదవ్.. ఆ లడ్డూను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రమేశ్ యాదవ్, అబాకస్ విద్యా సంస్థల అధినేత శశాంక్ రెడ్డి జగన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఇదీ చదవండి:TS Letter to KRMB: 'ఏపీ నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దు'