తెలంగాణ

telangana

ETV Bharat / city

Record: ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో పార్సిల్‌ ఆదాయం - తెలంగాణ తాజా వార్తలు

కరోనా కారణంగా ప్రయాణికులు తగ్గిన నేపథ్యంలో టికెటేతర ఆదాయంపై దృష్టి సారించిన దక్షిణ మధ్య(ద.మ.) రైల్వేకు పార్సిల్‌ ఆదాయం ఆశలు రేకెత్తిస్తోంది. రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆ సవాలును అధిగమించి మే నెలలో రికార్డు స్థాయిలో పార్సిల్‌ ఆదాయం వచ్చినట్లు ద.మ. రైల్వే ప్రకటించింది.

Record parcel revenue to Southern Railway
ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో పార్సిల్‌ ఆదాయం

By

Published : Jun 4, 2021, 9:19 AM IST

ఈ ఏడాది మే మాసంలో దక్షిణ మధ్య రైల్వే జోన్​ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించింది. జోన్​ పార్సిల్​లో ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరం మే నెలలో 44,374 టన్నుల లోడ్​ను సరఫరా చేయడం ద్వారా రైల్వే శాఖ రూ.19.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

దేశం మొత్తం మీద కొవిడ్​ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సమయంలో ఈ ఘనత సాధించడం విశేషం. నిత్యావసర వస్తువుల సరఫరాపై కరోనా ప్రభావం పడకుండా సజావుగా సాగేలా రైల్వేశాఖ అనేక చర్యలు తీసుకుంది. తద్వారా పార్శిల్​లో జోన్ మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం రూ. 19.14 కోట్లు సాధించింది. ఇది జనవరి 2021 నెలలో సాధించిన పార్సిల్‌ ఆదాయం కంటే దాదాపు రూ.3 కోట్లు అధికమని అధికారులు వెల్లడించారు. జోన్‌ మే 6 న ఒక్క రోజే పార్సిల్‌లో రూ.1.099 కోట్ల రికార్డు ఆదాయాన్ని పొందిందనట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు పండ్లు, ఔషధాలు, వరి, కోడి గుడ్లు, నిమ్మకాయలు, నెయ్యి వంటి అనేక నిత్యవసర వస్తువుల రవాణాను రైళ్ల ద్వారా సరఫరా చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. వీటితో పాటు దేశ రాజధానికి దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా 62 లక్షల లీటర్ల పాలను కూడా సరఫరా చేశాయి. దక్షిణ మధ్య రైల్వే 69 కిసాన్‌ ప్రత్యేక రైళ్లను నడిపి నాగర్‌సోల్‌, నూజివీడు, లింగంపేట జగిత్యాల నుంచి 24,748 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసింది.

ఇదీ చూడండి: child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!

ABOUT THE AUTHOR

...view details