ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 70,584 నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ఇవాళ కొవిడ్-19 నుంచి 2,784 మంది కోలుకోగా.. మొత్తం 55,406 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 63,771 మంది చికిత్స పొందుతున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది.