ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా.. కొత్తగా 7998 కేసులు
18:06 July 23
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా.. కొత్తగా 7998 కేసులు
ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 7,998 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 72,711కు చేరింది. వైరస్ బారిన పడి మరో 61 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 884కు చేరుకుంది. ఆస్పత్రుల్లో 34,272 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 37,555 మంది డిశ్ఛార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 58,052 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏపీలో 14 లక్షల 93 వేల 879 మంది పరీక్షలు చేశారు.
కరోనాతో తూర్పుగోదావరిలో 14, గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా... కర్నూలులో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు వైరస్‌కు బలయ్యారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లా నమోదైన కేసులు తూర్పు గోదావరి 1,391 గుంటూరు 1,184 అనంతపురం 1,016 కర్నూలు 904 పశ్చిమ గోదావరి 748 విశాఖ 684 నెల్లూరు 438 శ్రీకాకుళం 360 విజయనగరం 277 ప్రకాశం 271 కృష్ణా 230 కడప 224