Corona Cases In AP: ఏపీలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా మారింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,713 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 10,057 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 8 మంది మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,827, చిత్తూరు జిల్లాలో 1,822, గుంటూరు జిల్లాలో 943, తూర్పుగోదావరి జిల్లాలో 919, అనంతపురం జిల్లాలో 861, ప్రకాశం జిల్లాలో 716, కడప జిల్లాలో 482 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ నుంచి మరో 1,222 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 2,82,970 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 441 మంది మరణించారు. 1,88,157 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు:4,87,202
- యాక్టివ్ కేసులు:18,31,000
- మొత్తం కోలుకున్నవారు:3,55,83,039
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.