తెలంగాణ

telangana

ETV Bharat / city

తుదిదశకు 'ఆదిపురుష్' చివరి షెడ్యూల్ - ఆదిపురుష్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'ఆదిపురుష్' చిత్రం చివరిదశకు చేరుకుంది. లాక్డౌన్ కారణంగా కొంతకాలం వాయిదా పడిన 'ఆదిపురుష్' చివరి షెడ్యూల్..​. సెప్టెంబర్ 18న తిరిగి ప్రారంభమైంది.

Adipurush
Adipurush

By

Published : Sep 19, 2021, 4:06 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్​ చివరి దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్​ను ప్రారంభించడానికి సెప్టెంబర్ 17న ముంబయికి బయలుదేరింది చిత్రబృందం. లాక్డౌన్ కారణంగా కొంతకాలం వాయిదా అనంతరం సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.

ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను 'ఆదిపురుష్​' బృందం ముంబయిలో సెప్టెంబర్ 18న ప్రారంభించింది. అక్టోబర్ మూడో వారం నాటికి షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్​ అలీఖాన్​ రావణుడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: ప్రభాస్‌ చేతుల మీదగా 'కళాకార్‌'.. సందీప్​ కిషన్​ కొత్త సినిమా

ABOUT THE AUTHOR

...view details