Bigg Boss Telugu season5 : బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో తాజాగా యాంకర్ రవి ఎలిమినేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. నామినేషన్లలో ఉన్న మిగతా కంటెస్టంట్‌లతో పోలిస్తే రవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ వారికంటే రవి బయటకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ రవి ఫ్యాన్స్ సహా నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? నిజంగానే మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయా?
Anchor Ravi Elimination from BigBoss Telugu Season5 : ఈ సీజన్‌లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే యాంకర్ రవికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మాస్ మహారాజాగా ఎదిగిన రవి గ్రాఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో మొదట్లో బాగానే ఉండేది.
అయితే లహరి-ప్రియ ఎపిసోడ్‌లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అప్పటివరకు గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అని ట్యాగ్ లైన్స్ వచ్చినా ఈ ఒక్క ఎపిసోడ్‌తో రవి గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
ఇక శ్వేత ఎలిమినేషన్‌కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్ అయ్యాడు. అయినప్పటికీ అతనికి ఉన్న ఫ్యాన్ బేస్‌తో నామినేట్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి కూడా నామినేషన్స్ నుంచి ఈజీగా గట్టెక్కేస్తాడని అంతా భావించారు. టాప్-5కి రవి చాలా సులువుగా చేరుకుంటాడని అనుకున్నారంతా. దీంతో రవికి ఎలాగైనా భారీ ఓట్లు పడతాయని భావించి ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నవారిని సేవ్ చేయడం కోసం వారికి ఓట్లు వేశారు. ఇది రవికి చాలా పెద్ద మైనస్‌గా మారింది. రవి అనూహ్యంగా బయటకు రావడం తన అభిమానులకు పెద్ద షాకింగ్‌గా మారింది.
ఇదీ చదవండి :Shilpa Chaudhary: శిల్పా చౌదరిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్