తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రి.... రాయలసీమలోనే పెద్ద ఆస్పత్రుల్లో ఒకటి. మొత్తం వెయ్యి మంది రోగులకు చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో 700 వరకూ ఆక్సిజన్ పడకలే ఉన్నాయి. నిత్యం 30 మంది డ్యూటీ డాక్టర్లు... రోగులను పరిశీలిస్తూ ఉంటారు. ఇంత కీలకమైన చోట... ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపింది. రోగులు ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్న దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఇటీవల ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని... స్విమ్స్, రుయా ఆస్పత్రులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
పర్యవేక్షణలో నిర్లక్ష్యం...
రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని...ఈ సమావేశాల్లో వైద్యులు కోరారు. అయినా సరే 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే వరకూ... ఆసుపత్రి సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడులోని శ్రీపెరంబూరు నుంచి ఉదయం రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్... సాయంత్రం వరకూ రాకపోయినా పర్యవేక్షించాల్సిన వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
జాప్యానికి 11 ప్రాణాలు బలి...