రియల్‌మి జిటి నియో2 భారతదేశంలో లాంచ్ అయింది. ఈ సరికొత్త రియల్‌మి జిటి ఫోన్ రియల్‌మి జిటి నియోకి హంగులు జోడించి లేటెస్ట్గా తీసుకొచ్చారు. మేలో రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్‌గా భారత్‌లో ఈ వెర్షన్‌ను లాంచ్ చేశారు. ఈ Realme GT Neo 2 120Hz AMOLED డిస్‌ప్లేను, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తోంది. భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ తదుపరి తరం సెల్యులార్ నెట్‌వర్క్ 5జీ సేవలను దేశంలో ఇంకా ప్రారంభించకున్నా... ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో వస్తోంది. రియల్‌మి జిటి నియో2లో.. డాల్బీ అట్మోస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, 65W వేగవంతమైన ఛార్జింగ్, ఉష్ణోగ్రతల నిర్వహణ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్, హీట్-సింక్ చాంబర్ వంటి అద్భుతమైన ఫీచర్లు పొందుపరిచారు. రియల్‌మి జిటి నియో2... శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 52, ఎంఐ 11ఎక్స్ 5జి, పోకో ఎఫ్ 3 జిటి వంటి సమాన శ్రేణి స్మార్ట్ ఫోన్లతో పోటీపడనుంది.
భారతదేశంలో Realme GT Neo 2 ధర, లభ్యత
భారతదేశంలో Realme GT Neo 2 ధర బేసికి మోడల్ అయిన 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.31,999, 12GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తున్న వేరియంట్ ధర రూ.35,999. ఇది నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ వంటి మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మే జిటి నియో2ను.. అక్టోబర్ 17నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్ కామ్ లతో పాటు దేశంలోని మెయిన్లాండ్ ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయిస్తారు. రియల్‌మి జిటి నియో 2 లాంచ్ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో రూ. 7,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం, ఈ ఫోన్ అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి GT నియో 2 బేస్ 8GB + 128GB వేరియంట్ సుమారు రూ. 29,300 ప్రారంభ ధరతో,.. 12GB + 256GB మోడల్ ధర CNY 2,999(సుమారు రూ. 35,100)తో గత నెలలోనే చైనాలో ప్రారంభమైంది.
రియల్‌మి జిటి నియో 2 స్పెసిఫికేషన్‌లు