ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డి అపహరణ యత్నం కలకలం రేపింది. ఇంటి సమీపంలోనే కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన యాదగిరిరెడ్డి వారి నుంచి తప్పించుకొని ఇంట్లోకి పరుగుతీశారు. చేసేదేం లేక రెండు కార్లలో వచ్చిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అపహరణ యత్నంపై యాదగిరిరెడ్డి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై బాధితుల అనుమానం - real estate business man trying to kidnap in lbnagar
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. అప్రమత్తమైన వ్యాపారి తప్పించుకున్నారు. దీని వెనుక కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నట్లు... యాదగిరిరెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేశారు.
స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై అనుమానం
మహబూబ్నగర్ జిల్లాలో యాదగిరిరెడ్డికి సంబంధించిన భూ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఇదే విషయమై రాజీ కుదర్చడానికి యత్నించినా.. యాదగిరిరెడ్డి ససేమిరా అన్నారని అతని భార్య తెలిపారు. దీని వెనకాల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నట్లు యాదగిరిరెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ