హైదరాబాద్‌లో 50 రోజులకు పైగా మూసేసి ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేడు తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం మార్కెట్‌ను తెరవటం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొహెడలో సదుపాయాలు లేవని, ఇక్కడైతే పూర్తి స్థాయిలో సదుపాయాలు ఉన్నందున వ్యాపారం చేసుకోవటం సులభతరం అవుతుందని వ్యాపారస్థులు అంటున్నారు. మార్కెట్‌కు నేడు బత్తాయి, యాపిల్స్ పెద్దఎత్తున తరలివచ్చాయి.
యాభై రోజుల తర్వాత గడ్డిఅన్నారం మార్కెట్ తిరిగి ప్రారంభం - gaddiannaram fruit market
హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేడు పునఃప్రారంభమైంది. యాభైరోజులుగా మూతపడిన మార్కెట్ నేడు తిరిగి ప్రారంభమవగా... వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు కావటం వల్ల వ్యాపారం అంతంతమాత్రంగానే జరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
re started gaddi annaram fruit market in hyderabad after 50 days
మొదటి రోజు కావటం వల్ల ఎక్కువ మందికి సమాచారం లేక పండ్లను తీసుకురాలేదని వ్యాపారులు చెబుతున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని జులై 12న ఈ మార్కెట్‌ను అధికారులు మాసివేశారు. అప్పటి నుంచి కొహెడ మార్కెట్‌లో కార్యకలాపాలు జరిగాయి. కరోనా, లాక్డౌన్ మూలంగా.... గడ్డిఅన్నారం మార్కెట్‌ను అధికారులు పలు మార్లు మూసేశారు. కొహెడ మార్కెట్‌లో గాలిదుమారంతో షెడ్డులు కూలిపోయిన సమయంలో కొన్ని రోజులు గడ్డిఅన్నారం మార్కెట్‌లో కార్యకలాపాలు జరిగాయి.