దిశ హత్యాచార నిందితుల మృత దేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించి ఆధారాలు సేకరించాలన్న అంశంపై శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. మృతదేహాలు పాడవుతున్నాయని, రీపోస్టు మార్టం నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషనర్లలో ఒకరి తరఫు న్యాయవాది వెంకన్న హైకోర్టును కోరారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులతోపాటు, అక్కడ దాఖలు చేసిన పిటిషన్‌లను తమకు సమర్పించాలని, శుక్రవారం దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.
దిశ కేసు నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టంపై నేడు విచారణ - re postmartam for disha accused dead bodies case hear by highcourt
దిశ నిందితుల మృతదేహాలు పాడవుతున్న నేపథ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటీషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు ధర్మాసనంలో విచారణ జరగనుంది.
దిశ కేసు నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టంపై నేడు విచారణ