తెలంగాణ

telangana

ETV Bharat / city

RDS: ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దంటూ.. ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ

ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ
ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ

By

Published : Jul 15, 2021, 8:25 PM IST

Updated : Jul 15, 2021, 9:37 PM IST

20:24 July 15

ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దంటూ.. ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ

రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాలువ పనులు చేపట్టవద్దంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఏపీ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) కు లేఖ రాసింది. బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, ఆమోదం పొందకుండా పనులు చేయొద్దని కేఆర్ఎంబీ బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా స్పష్టం చేశారు.

రాజోలిబండ నీటి మళ్లింపు పథకం కుడి కాలువ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 1980 కోట్లు విడుదల చేసింది. కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదారులు.. కర్నూలు జిల్లా కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో మార్చి 24న భూమిపూజ నిర్వహించారు. అప్పటి నుంచి కాలువ పనులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో.. పనులు నిలిపివేయాలని కేఆర్​ఎంబీ(KRMB) తాజాగా ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:KRMB: జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

Last Updated : Jul 15, 2021, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details