స్పుత్నిక్- వి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఈరోజును.. భారత్ - రష్యా దేశాలకు చారిత్రాత్మక రోజుగా రష్యా ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ అభివర్ణించారు. భారత్‌లో వినియోగంలోకి వచ్చిన మొదటి ఫారిన్ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్- వి చరిత్ర సృష్టించిందన్నారు. కొవిడ్‌పై పోరులో భారత్‌కు రష్యా తోడుంటుందని హామీ ఇచ్చారు.
'భారత్ - రష్యా దేశాలకు ఇది చారిత్రాత్మక రోజు' - స్పుత్నిక్- వి వ్యాక్సిన్
భారత్‌లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో వినియోగంలోకి వచ్చిన మొదటి ఫారిన్ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్- వి చరిత్ర సృష్టించిందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. ఇదే క్రమంలో స్పుత్నిక్ లైట్‌ను త్వరలో భారత్‌లో ఆవిష్కరిస్తామని దిమిత్రివ్ ప్రకటించారు.
rdif chief kiril dimitrov on sputnik-v vaccine starting in india
వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి షిప్‌మెంట్స్ వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది భారత్‌లో 850 మిలియన్ డోసుల స్పుత్నిక్- వి వ్యాక్సిన్ తయారీ తమ లక్ష్యమని దిమిత్రివ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో స్పుత్నిక్ లైట్‌ను త్వరలో భారత్‌లో ఆవిష్కరిస్తామని దిమిత్రివ్ ప్రకటించారు. కొవిడ్‌పై పోరులో రెండు దేశాలు కలిసి పనిచేయటంలో ఇదో కీలక ముందడగని కిరిల్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు
Last Updated : May 14, 2021, 10:17 PM IST