రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు వాయిదా - rayalaseema upliftment scheme latest news
19:52 June 26
రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఇటీవల కేంద్రం, కృష్ణా జలాల ట్రైబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 6 అంశాలపై కేంద్ర పర్యావరణశాఖ వివరణ కోరింది. ఎన్జీటీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ప్రాజెక్టు డ్రాయింగ్స్, లే అవుట్లు, చార్టుల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ద్వారా ఎంత నీరు వాడుకుంటారో స్పష్టం చేయాలని ఏపీని కోరింది.
గతంలో తెలుగుగంగకు ఇచ్చిన అనుమతులలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు కోరగా.. సవరణలు కోరుతూ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టత లేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ప్రాజెక్టు సవరణల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టత లేదని పేర్కొంది.
ఇదీ చూడండి:CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం