ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని పిటిషన్‌లో కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు వేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు - Rayalaseema Upliftment Schem latest news
రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుల్లో కేవియట్ దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్లు వేసింది. వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు వేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కేవియట్‌లు వేసింది.
![రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు రాయలసీమ ఎత్తిపోతల పథకం: వేర్వేరు కోర్టుల్లో ఏపీ ప్రభుత్వం పిటిషన్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8303311-774-8303311-1596618889337.jpg)
రాయలసీమ ఎత్తిపోతల పథకం: వేర్వేరు కోర్టుల్లో ఏపీ ప్రభుత్వం పిటిషన్లు