తెలంగాణలో తెదేపా ఖాళీ అయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. తమకు బలమైన కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సంస్కరణలు తీసుకురావడంలో తెదేపా చేసిన కృషి ఎనలేనిదని గుర్తుచేశారు. రాష్ట్ర పథకాల్లో అవినీతి జరిగిందంటున్న భాజపా నేతలు.. దాన్ని వెలికితీసే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకుంటున్న భాజపా వలసలను ప్రోత్సహించడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి 60 శాతం ఆదాయం వస్తోందని.. దాని వెనుక చంద్రబాబు కృషి ఉందన్నారు.
తెదేపాను తుడిచిపెట్టడం ఎవరితరం కాదు : రావుల - telugu desam party
రాష్ట్రంలో తెదేపాను తుడిచిపెట్టడం ఎవరితరం కాదని ఆపార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న భాజపా.. దాన్ని వెలికితీసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తెదేపాను తుడిచిపెట్టడం ఎవరితరం కాదు : రావుల
ఇవీ చూడండి: జేపీ నడ్డాది ద్వంద్వనీతి: సంపత్