టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏబీసీఎల్ సంస్థ నిధులను మళ్లించారన్న ఆరోపణలపై అరెస్టైన రవిప్రకాష్‌ను పదిరోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే అన్ని విషయాలు వివరించారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే మిగతా కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. పోలీసుల తరఫున గురువారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించనున్నారు. దీంతోపాటు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో పాటు బెయిల్ కోసం రవిప్రకాశ్ వేసిన పిటిషన్‌పై కూడా రేపే విచారణ జరగనుంది.
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా