కరోనా కారణంగా మూగబోయిన రవీంద్రభారతి పునఃప్రారంభం కానుంది. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. 11 నెలల తర్వాత తిరిగి ప్రారంభం అవుతున్న రవీంద్రభారతిలో 'తెలంగాణ వాగ్గేయకారుల వైభవం' అనే తొలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
ఆదివారం రవీంద్రభారతి పునఃప్రారంభం - హైదరాబాద్ తాజా వార్తలు
ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రవీంద్రభారతిని పునఃప్రారంభించనున్నారు. 'తెలంగాణ వాగ్గేయకారుల వైభవం' అనే తొలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించారు.
7వ తేదీన రవీంద్రభారతిని పునఃప్రారంభించనున్న మంత్రి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రేక్షకులు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు తప్పనిసారిగా ధరించాలని ఆయన సూచించారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రేక్షకుల సహకారం చాలా అవసరమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున 'కోటి వృక్షార్చన'