హైదరాబాద్‌లో మీ-సేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఆధార్-ఫోన్ నంబర్ అనుసంధానం కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా రేషన్ సరకుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు - telangana news
సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా రేషన్ సరకులు పంపిణీ జరుగుతుందన్న ప్రభుత్వం ప్రకటనివ్వడంతో ఆధార్-ఫోన్ నంబర్ అనుసంధానం కోసం మీసేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. హైదరాబాద్‌లో 39 కేంద్రాల్లో మాత్రమే ఆధార్ ఓటీపీ చేసుకునేందుకు అవకాశమున్నందున కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఆధార్ ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఫోన్ నంబర్-ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి లబ్ధిదారులు మీసేవా కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భాగ్యనగరంలోని 39 కేంద్రాల్లో ఆధార్ ఓటీపీ చేసుకునేందుకు అవకాశం ఉంది. రోజుకు ఒక్కో కేంద్రంలో 150 మంది అనుసంధానించేందుకు అవకాశమున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది.
కొన్ని కేంద్రాల్లోనే అవకాశమున్నందున.. నగరంలోని విజయనగర్ కాలనీ, మలక్‌పేట్, సంతోష్‌నగర్, వనస్థలిపురంలోని మీ-సేవా కేంద్రాలకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలివచ్చారు.