తెలంగాణ

telangana

ETV Bharat / city

శీతాకాలం విడిదిలో భాగంగా హైదరాబాద్​కు రాష్ట్రపతి - rastrapathi at bollaram

శీతాకాలం విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ నెల 20న హైదరాబాద్​ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. దక్షిణాది విడిది ముగించుకొని 28న దిల్లీ పయనమవుతారు.

president kovind
president kovind

By

Published : Dec 14, 2019, 8:31 PM IST

శీతాకాలం విడిదిలో భాగంగా హైదరాబాద్​కు రాష్ట్రపతి

దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్​ రానున్నారు. 28 వరకు రాష్ట్రపతి దక్షిణాది పర్యటన కొనసాగనుంది. 20న దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

28న దిల్లీకి

23 నుంచి 26 వరకు కేరళలో రాష్ట్రపతి పర్యటిస్తారు. 26న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రామ్ నాథ్ కోవింద్... రాష్ట్రపతి నిలయంలో జరిగే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. దక్షిణాది విడిది ముగించుకొని 28న దిల్లీ పయనమవుతారు.

ఇదీ చూడండి: భార్య ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్​ సస్పెండ్​

ABOUT THE AUTHOR

...view details