అధికార రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగంపై నమోదైన కేసులో ముంబయి పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి రష్మి శుక్లా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రష్మి శుక్లా ప్రస్తుతం హైదరాబాద్లో సీఆర్పీఎప్ అదనపు డీజీగా పని చేస్తున్నారు. ఆమె.. నిఘా విభాగం అధిపతిగా ఉన్నప్పుడు.. పోలీసుల బదిలీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని విపక్ష నేతలకు లీక్ చేశారన్న అభియోగంపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
సమాచారం లీక్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రష్మి శుక్లా - rashmi shukla approached telangana high court
అధికార రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగంపై నమోదైన కేసులో ముంబయి పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి రష్మి శుక్లా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా.. వ్యక్తిగతంగా హాజరు కావాలని వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టు, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన రష్మి శుక్లా, రష్మి శుక్లా కేసు
విచారణ కోసం వ్యక్తిగతంగా హాజరు కావాలని గత నెల 28, 29 తేదీల్లో రష్మి శుక్లాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా.. వ్యక్తిగతంగా హాజరు కావాలని వేధిస్తున్నారంటూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నలు పంపిస్తే లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని చెప్పినా వినిపించుకోవడం లేదని తెలిపారు. పిటిషన్పై వివరణ ఇవ్వాలని ముంబయి పోలీసులతో పాటు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణ ఈనెల 7కు వాయిదా వేసింది.