తెలంగాణ

telangana

ETV Bharat / city

గద్దను పోలి.. పొట్టపై చుక్కలు.. నల్లమలలో అరుదైన పక్షి - nandyal latest news

Owl: నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన గుడ్లగూబను గుర్తించినట్లు జీవవైవిధ్య విభాగం రేంజ్‌ అధికారి మహ్మద్‌ హయాత్‌ తెలిపారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణులు, పక్షులను గుర్తించే క్రమంలో ఈ అరుదైన గుడ్లగూబను గుర్తించి చిత్రీకరించామన్నారు.

Owl
Owl

By

Published : Jun 18, 2022, 2:43 PM IST

Owl: దట్టమైన అడవులతో నిండి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన గుడ్లగూబను గుర్తించినట్లు జీవవైవిధ్య విభాగం రేంజ్‌ అధికారి మహ్మద్‌ హయాత్‌ తెలిపారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణులు, పక్షులను గుర్తించే క్రమంలో ఈ స్పాట్‌ బెల్లీడ్‌ ఈగల్‌ గుడ్లగూబను గుర్తించి చిత్రీకరించామన్నారు. గద్దను పోలి, పొట్టపై చుక్కలు ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని నంద్యాల జిల్లా సున్నిపెంటలోని జీవ వైవిధ్య కేంద్రంలో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details