మరో దారుణం.. మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం - undefined
14:11 October 08
మరో దారుణం.. మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక (17)పై ఓ వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక నీరసంగా ఉంటుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఆసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.
ఇదీ చూడండి: చిన్నారుల అశ్లీల వీడియోలు... రంగంలోకి కేంద్ర హోంశాఖ... హైదరాబాద్‌లో అరెస్టు