తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది' - model rape news

అత్యాచారం చేశారని తన కుమారుడిపై ఓ యువతి తప్పుడు ఫిర్యాదు చేసిందని నాగభవాని అనే మహిళ ఆరోపించింది. ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపించిందని పేర్కొంది. ఆ యువతికి సంబంధించిన వాయిస్​ రికార్డులు, వాట్సాప్ చాటింగ్​లను జూబ్లీహిల్స్​ పోలీసులకు ఇచ్చింది.

model
model

By

Published : Jan 11, 2020, 4:56 PM IST

Updated : Jan 11, 2020, 6:25 PM IST

అత్యాచారం చేశారంటూ తన కుమారుడిపై ఓ యువతి అక్రమంగా ఫిర్యాదు చేసిందని నాగభవాని అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడితో పాటు అతని స్నేహితుడిని కేసులో ఇరికించిందంటూ ఆమె తెలిపింది. యువతి దురుద్దేశంతో ఒకేసారి తన కుమారుడితో పాటు అతని స్నేహితుడితోనూ ప్రేమాయణం నడిపించిందని... చివరికి ఇద్దరినీ ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని నాగభవాని ఆరోపించింది. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్​లను జూబ్లీహిల్స్​ పోలీసులకు అందజేసింది.

ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించారని బాధితురాలు తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నామని జూబ్లీహిల్స్​ ఏసీపీ కేఎస్​ రావు తెలిపారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుల తరఫు ఆరోపణలపై ఫిర్యాదు వస్తే... అది కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు.

'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'

ఇదీ చూడండి: 'అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలే'

Last Updated : Jan 11, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details