'సురేందర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' - tsrtc strike in 2019
14 ఏళ్లు ఆర్టీసీ కండక్టర్‌గా సేవలందించిన సురేందర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని తోటి కార్మికులు ఆరోపించారు.
రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ రాణిగంజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 14 ఏళ్లు ఆర్టీసీకి సేవలందించిన సురేందర్.. ఉద్యోగం నుంచి తొలగించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు.. లోపలికి వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచె అడ్డుగా వేశారు.
- ఇదీ చూడండి : 'మా పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు'