తెలంగాణ

telangana

ETV Bharat / city

Life imprisonment: మైనర్​ బాలికపై అత్యాచారం.. దోషికి జీవిత ఖైదు - Rangareddy district court verdict

అభం శుభం తెలియన మైనర్ బాలికపై (Rape of a minor girl) కన్నేశాడు ఓ కామాంధుడు. చిన్నారి అని సైతం చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎంఎస్​జే న్యాయస్థానం (Rangareddy District Court) జీవితఖైదు (Life imprisonment) విధించింది.

Life imprisonment
Life imprisonment

By

Published : Oct 6, 2021, 12:15 PM IST

మైనర్​ బాలికపై అత్యాచారానికి (Rape of a minor girl) పాల్పడిన ఘటనలో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎంఎస్​జే న్యాయస్థానం (Rangareddy District Court) జీవితఖైదు(Life imprisonment) విధించింది. అసలేం జరిగిందంటే...

కామాంధుడికి జీవితఖైదు

గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీసు స్టేషన్​ పరిధి ఎర్రగడ్డలోని ఛత్రపతి శివాజీనగర్​కు చెందిన నవీన్​ అనే 21 ఏళ్ల యువకుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. విచారణలో పోలీసులు నిందితుడు నవీన్​కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను న్యాయమూర్తి ముందుంచారు. వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి నిందితుడు నవీన్​కు జీవిత ఖైదుతో పాటు.. 1000 రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

న్యాయస్థానం తీర్పుతో... స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అభం, శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకెన్నాళ్లీ అకృత్యాలు

అర్ధరాత్రి సంగతి అటుంచితే పగలు కూడా బాలికలు, మహిళలు, ఆఖరికి వృద్ధులు సైతం ఒంటరిగా తిరిగేందుకు భయపడుతున్నారు. కొందరు మృగాళ్లు చేస్తున్న ఆకృత్యాలే దీనికి కారణం. వయసు, వరసలు కూడా మర్చిపోయి సమాజంలో ఉంటున్నామనే స్ప్రహ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. కొందరు కామాంధుల చేష్టలతో సభ్య సమాజం తలదించుకుంటోంది. ఆడపిల్లలపై చేయివేస్తే కఠినశిక్షలు తప్పవంటూ నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత సైతం... మహిళలు, చిన్నారులపై మరిన్ని ఎక్కువగా ఆకృత్యాలు జరగడం విచారకరం. సభ్య సమాజం తలదించుకునేలా స్వార్ధంతో మనిషి జీవనం సాగిస్తున్నాడు. స్వార్ధానికి మారుపేరు మనుషులు అనే మాటను నిజం చేస్తూ భవిష్యత్‌ తరాలకు ఇదే బాటలు వేస్తున్నారు కొందరు మృగాళ్లు... ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.

ఇదీ చూడండి: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితునికి జీవితఖైదు

ABOUT THE AUTHOR

...view details