RAMESH BABU FAN: ఆయన ఆప్యాయత వెలకట్టలేనిది: రమేశ్‌బాబు అభిమాని - ramesh babu latest news
Ramesh Babu Letter to Fan: ఏపీలోని కృష్ణాజిల్లాలో ఓ పోలీసు అధికారి సూపర్‌స్టార్ కృష్ణ మీద అభిమానంతో లేఖలు రాసేవారు. దీనికి రమేశ్‌బాబు రిప్లై ఇస్తుండేవారు. అయితే 1988లో ప్రింటెడ్ మేటర్‌లో రిప్లై వస్తుండటంతో.. మీరు నా లేఖ చదవకుండానే రిప్లై ఇస్తున్నారని.. అలాకాకుండా స్వదస్తూరితో ప్రత్యుత్తరం రాయాలని కోరినట్లు ఆ అభిమాని తెలిపారు. దీంతో రమేశ్‌బాబు.. ఆ అభిమాని కోరినట్లు లేఖ రాయడం విశేషం. రమేశ్‌బాబు మృతితో ఇప్పుడు ఆ అభిమాని.. తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
RAMESH BABU