ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ డీసీ సుజాత, విజయనగరం సహాయ కమిషనర్ రంగారావులపై సస్పెన్షన్ వేటు వేశారు.
రామతీర్థం హుండీ కేసులో అధికారులపై చర్యలు - Ramatirtham temple issue
ఏపీలోని రామతీర్ధం ఆలయ హుండీ లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డ ఘటనలో దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. విశాఖ దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్‌తో పాటుగా విజయనగరం సహాయ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
రామతీర్థం హుండీ కేసులో అధికారులపై చర్యలు
ఈ నెల 17న హుండీ లెక్కింపు సందర్భంగా దేవాదయ శాఖ కమిషనర్ సుజాత వాహన డ్రైవర్ చేతివాటం ప్రదర్శించి..బంగారు శతమానం, రూ.3 వేలు దొంగిలించాడు. ఈ క్రమంలో నగదు లెక్కింపు చోటుకు డ్రైవర్ రావడానికి అనుమతినిచ్చిన డీసీపై దేవదాయశాఖ వేటు వేసింది. పర్యవేక్షణ లోపం వల్ల విజయనగరం సహాయ కమిషనర్ రంగారావు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.