మహారాష్ట్రకు చెందిన శివాజీరాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ రామంతాపూర్‌లోని శారదానగర్‌కు వచ్చాడు. రహదారి పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీలోని ఓ ఇంట్లో కుటుంబంతో అద్దెకుంటున్నాడు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... సాయం చేసిన కార్పొరేటర్ - ramanthapoor corporator
రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌తో తన కుటుంబాన్ని పోషించడం భారమవుతోందని హైదరాబాద్ రామంతాపూర్‌లో నివసిస్తోన్న శివాజీరాజు ఈనాడు-ఈటీవీ భారత్‌ను సంప్రదించారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ గంధం జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించారు.
సాయం చేసిన కార్పొరేటర్
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కుటుంబ పోషణ భారమవుతోందని శివాజీరాజు ఈనాడు-ఈటీవీ భారత్‌ను సంప్రదించాడు. ఈటీవీ భారత్ ఈ విషయాన్ని కార్పొరేటర్ గంధం జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించారు. నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.