ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన విద్యావేత్త దేవసాని రామమనోహరరెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమవారం తన ఇంటి వద్ద నిరాడంబరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.కోటి విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని 150 మంది పేదలకు అందజేశారు. ఒక్కొక్కరికి 107 చ.గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ దానపత్రాలను గ్రామపెద్దల సమక్షంలో పంపిణీ చేశారు. జనవరి 18న మరో వంద మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇంకో మూడెకరాల స్థలం సిద్ధం చేయనున్నట్లు మనోహరరెడ్డి తెలిపారు.
Land Gift: రూ.కోటి విలువైన స్థలం.. 150 మంది పేదలకు!
ఏపీలోని ప్రకాశం జిల్లా పొట్లపాడుకు చెందిన విద్యావేత్త దేవసాని రామమనోహరరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. రూ.కోటి విలువైన నాలుగెకరాల స్థలాన్ని 150 మంది పేదలకు దానం చేశారు. ఒక్కొక్కరికి 107 చ.గజాల ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేశారు.
పేదలకు భూమి దానం, పేదల ఇళ్ల కోసం దానం
మూడు దశాబ్దాల క్రితం పొట్లపాడు వదిలి బెంగళూరులో స్థిరపడిన ఆయన.. స్వస్థలానికి వచ్చినప్పుడల్లా రూ.లక్షలు వెచ్చించి దానధర్మాలు చేస్తుంటారని గ్రామస్థులు తెలిపారు. ఆయన దాతృత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇదీ చూడండి:భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మేలు?