కరోనా వ్యాప్తి దృష్యా కొద్దిమంది మతపెద్దల సమక్షంలో మసీదుల్లో.....రంజాన్ ప్రార్ధనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో రంజాన్ ప్రార్థనలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మక్కా మసీదులో కేవలం ఐదుగురితో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. పాతబస్తీ సహా భాగ్యనగరంలోని అన్ని మసీదుల వద్ద జనం గుమికూడకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు
కరోనా వ్యాప్తి దృష్ట్యా రంజాన్ పూట కూడా మసీదులు వెలవెలబోయాయి. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో కొంతమంది మతపెద్దల సమక్షంలోనే ప్రార్థనలు నిర్వహించారు. మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాల్లో సీపీ అంజనీ కుమార్ పర్యటించారు.
రంజాన్, హైదరాబాద్లో రంజాన్
హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితిని సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. మక్కా మసీదు, చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ముస్లిం సోదరులు అందరూ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకొని ఎంతో సహకరించారని తెలిపారు. మసీదుల్లోనూ నలుగురితోనే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని వెల్లడించారు. పాతబస్తీలో లాక్డౌన్కు ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు.