ఏపీ విజయనగరం జల్లా రామతీర్థం కొండపై రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యమైంది. లోతైన కొలనులో ఉదయం నుంచి గాలింపు చేపట్టగా... శ్రీరాముడి విగ్రహ శకలం దొరికింది. చినజీయర్‌స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యం - ap latest news
ఏపీ విజయనగరం జల్లా రామతీర్థం కొండపై రామకొలనులో రాముడి విగ్రహ శకలం దొరిగింది. ఉదయం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం గాలింపు చేపట్టగా రామతీర్థంలో రాముడి విగ్రహ శకలం లభ్యమైంది. మంగళవారం సాయంత్రం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని దుంగడులు ధ్వంసం చేశారు.

temple
మంగళవారం సాయంత్రం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కోదండ రాముడి తలను తమతో పాటు తీసుకెళ్లగా.. సీత, లక్ష్మణ విగ్రహాలకు ఎటువంటి హాని చేయలేదు. తల లేని రాముడి విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాజకుమారితో పాటు స్థానిక పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం గాలింపు చేపట్టాగా.. బుధవారం రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యమైంది.
రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యం