హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను కబ్జా చేయడానికి బడా నిర్మాణ సంస్థలు యత్నిస్తున్నాయని ప్రొఫెసర్ పి.రాములు ఆరోపించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ నుంచి టీఎన్జీవోస్ కాలనీ వరకు యూనివర్సిటీకి చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అదే ప్రాంతంలో రెండు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.
వర్సిటీ భూములు రక్షించాలని ప్రొఫెసర్ల పాదయాత్ర - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్లు రెండు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని ప్రొఫెసర్ పి.రాములు డిమాండ్ చేశారు.
వర్సిటీ భూములు కబ్జా: ప్రొఫెసర్ పి.రాములు