Raksha Bandhan Celebrations 2022: అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల మధ్య బంధాన్ని గుర్తు చేసేదే రాఖీ పండుగ. దగ్గరున్నప్పడు తెలియని ఆత్మీయతను.. దూరమైన చెరగని వాత్సల్యాన్ని పంచుతుంది ఈ పండుగ. ప్రతి ఇంటా అనుబంధాలు, అప్యాయతల వెలుగులను పెంపొందిస్తోంది. తోబుట్టులవుల మధ్య అన్యూన్యతను.. అనురాగాలను ద్విగునీకృతం చేస్తుంది. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. ఆడవాళ్లు తమ అన్నలు, తమ్ముళ్ల చేతీలకు రాఖీలు కట్టేయడంలో మునిగిపోతారు. ప్రతీ సొదరుడు తన అక్కా చెల్లెళ్లకు తోచిన మేరకు కానుకలు సమర్పించి.. వారి ముఖాల్లో చిరునవ్వు చిందింపచేస్తాడు. ఎల్లవేళల తోడుంటానని అభయమిస్తాడు. రెండేళ్లుగా కరోనా కారణంగా పండుగను జరుపుకునే అవకాశం లేకపోవడంతో.. ఈసారి ఘనంగా జరుపుకునేందుకు మహిళలు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్లో పండుగ సందడి.. అక్కాచెల్లెల్లతో కళకళలాడుతోన్న 'రాఖీ' దుకాణాలు - రాఖీ పండగ
Raksha Bandhan Celebrations 2022: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతికైన రాఖీ పండగ రేపు కావడంతో.. హైదరాబాద్‌లోని రాఖీ దుకాణాలు మహిళలతో సందడిగా మారాయి. రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలతో బేగంబజార్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అన్నా చెల్లి, అక్క తమ్ముళ్ల మధ్య బంధాన్ని పెంచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
రాఖీ పండుగ నాడు దూరాన ఉన్న అన్నలకు, తమ్ములకు రాఖీలు కట్టేందుకు ఆడవాళ్లు ఎంతదూరమైన ప్రయాణం చేస్తారు. ఈ వేడుక కోసం ఎంతోమంది ఆడపడుచులు ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తారు. ఈ రాఖీ పండుగ సోదర సోదరీమణుల అనుబంధాలను మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ఎక్కడ చూసినా అన్ని దుకాణాలు మహిళలతో నిండిపోతుంటాయి. అయితే కరోనా వల్ల రెండెళ్లు మార్కెట్ దెబ్బతిందని.. ఈ ఏడాది మాత్రం బాగుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు దూదీతో చేసిన రాఖీలకు ప్రాధాన్యత ఉండగా.. ఇప్పుడు రకరకాల రాఖీలు అందుబాటులోకి వస్తున్నాయి. తరాలు మారినా యుగాలు గడిచిన ఎనాటికి వన్నె తగ్గినిదే ఈ రాఖీ పండుగ.
ఇవీ చూడండి: