తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియలో అలసత్వం తగదు' - నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష

Assets Registration Update Process: రాష్ట్రంలో ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియపై నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం తగదని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రికార్డులు, ఆన్​లైన్​లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆధికారులు, ఇంజినీర్లకు స్పష్టం చేశారు.

Assets Registration Update Process
Assets Registration Update Process

By

Published : Jun 22, 2022, 8:24 AM IST

Assets Registration Update Process: ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియలో అలసత్వం తగదని ఇంజనీర్లు, అధికారులకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్​ సూచించారు. శాఖకు సంబంధించిన భూములు, భవనాలు సహా ఇతరత్రా ఆస్తుల ఇన్వెంట్రీపై ఆయన సమీక్షించారు. సేకరించిన ఆస్తులన్నీ వెనువెంటనే శాఖకు బదలాయింపు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పటికప్పుడు రికార్డులు, ఆన్​లైన్​లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆధికారులు, ఇంజినీర్లకు స్పష్టం చేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కసరత్తులో కొందరు తగిన రీతిలో స్పందించకపోవడంపై రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన మేర పురోగతి లేదని అన్నారు.

సమయాభావం, సాధ్యాసాధ్యాలను కొందరు కారణాలుగా చెప్పినట్లు సమాచారం. సాధ్యం కాకపోతే తామే చేసుకుంటామని ఓ దశలో రజత్ కుమార్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వీలైనంతర త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం తగదని ఆయన పేర్కొన్నారు. నిత్యం ఈ కసరత్తు జరుగుతూనే ఉండాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details