అభిరుచి, సాధించాలనే పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్నాడు.. ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడు. ఇతని పేరు ఆచంట ఉమేశ్. స్వస్థలం ఏపీలోని రాజమహేంద్రవరం. చిన్నప్పటి నుంచి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిడిగా ఉన్న ఈ యువకుడు.. అనూహ్యంగా పర్వతారోహణ వైపు మళ్లాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి... రికార్డు సృష్టించాడు.
చిన్న వయస్సు నుంచే క్రీడలపై మక్కువ..
చిన్నవయస్సు నుంచి టేబుల్ టెన్నిస్‌లో క్రీడపై మక్కువ పెంచుకున్న ఉమేశ్.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆ ప్రతిభ ఆధారంగానే 2010లో భారత తపాలా శాఖలో ఉద్యోగం సంపాదించాడు.
400 పతకాలు సొంతం..
జాతీయ స్థాయిలో 30 సార్లు ఏపీకి ప్రాతినిధ్యం వహించిన ఉమేశ్.. అంతర్జాతీయ పోటీల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఒమెన్ ఓపెన్ ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న ఈ యువ ఆటగాడు.. అమెరికాలో జరిగిన బటర్ ఫ్లై క్యారీ కప్ డివిజన్ బి ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. ఇలా వివిధ టోర్నమెంట్లలో 400 వరకు పతకాలు సాధించి.. టెబుల్ టెన్నిస్ అంటే తనకెంత ఇష్టమో తెలియజేశాడు.
పర్వతారోహణ చేయాలనే కోరిక..
ఓ వైపు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించే ఆట.. మరో వైపు ఉద్యోగం. అలా సాఫీగా సాగిపోతుండగా.. ఉమేశ్‌కు మనస్సు మరో సాహస క్రీడ వైపు మళ్లింది. చాలా తక్కువ మంది ఆసక్తి చూపించే.. పర్వతారోహణ చేయాలనే కోరిక కలిగింది. ఏదైనా కావాలనుకుంటే ఎంత కష్టమైనా సాధించేతత్వం ఉన్న ఉమేశ్‌కు ఆ ఆలోచన కుదురుగా ఉండనివ్వలేదు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని నిమాస్లో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం.. అదే రాష్ట్రంలోని 16 వేల అడుగుల ఎత్తుండే మీరాతాంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. దాంతో తన కోరిక నెరవేరిందని సంతృప్తి చెందాడు.
'నేనేందుకు అధిరోహించకూడదు'