తెలంగాణ

telangana

ETV Bharat / city

మొదటి రోజు రూ.494.11 కోట్ల రైతుబంధు సాయం పంపిణీ - రైతుబంధు సాయం జమ

యాసంగి యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభమైంది. ఒక ఎకరా వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది.

raithubandhu funds credited into farmers account today
మొదటి రోజు రూ.494.11 కోట్ల రైతుబంధు సాయం పంపిణీ

By

Published : Dec 28, 2020, 2:25 PM IST

Updated : Dec 28, 2020, 8:11 PM IST

రాష్ట్రంలో... యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభమైంది. మొదటి రోజు ఒక ఎకరాలోపు పొలం ఉన్న 16 లక్షల 4 వేల మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం జమచేశారు. మొత్తంగా 9 లక్షల 88 వేల ఎకరాలకు... ఎకరాకు ఐదు వేల చొప్పున 494 కోట్ల రూపాయలు జమచేశారు.

తొలుత ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయాలని నిర్ణయించిన సర్కారు.... తర్వాత 2, 3, 4 ఎకరాల్లోపు భూమి ఉన్నవారికి సొమ్ము జమచేయాలని నిర్ణయించింది. మంగళవారం ... రెండు ఏకరాల్లోపు భూమి ఉన్న వారికి సాయం జమ చేయనుంది. మొత్తం 61 లక్షల 49 వేల మంది రైతులకు చెందిన కోటీ 52 లక్షల ఎకరాలకు.... 7 వేల 515 కోట్లు రైతుబంధు సాయంగా అందించనుంది.

కొత్తగా నమోదైన లక్షా 75 వేల మంది పేర్లను వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేశారు. సొమ్ము జమ అయినట్లు ఫోన్‌కు సందేశం రాగానే.... ఆధార్‌, బ్యాంకు పాసు పుస్తకంతో పోస్టాఫీస్‌కు వెళ్తే సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్

Last Updated : Dec 28, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details