తెలంగాణ

telangana

ETV Bharat / city

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..! - rains in hyderabad

Rains Update Today: మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Rains Update in Telangana and Andhrapradesh
Rains Update in Telangana and Andhrapradesh

By

Published : Aug 7, 2022, 6:58 PM IST

Rains Update Today: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంట అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తరువాత ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎల్లుండి (మంగళవారం) వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

ఇప్పటికే హైదరాబాద్​లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్​బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details