ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపింది. ప్రస్తుతం 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు - rains in north telangana
రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో రాబోయే రెండు, మూడు రోజులు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు
ఇవీచూడండి: వ్యాధుల నివారణపై అధికారుల ప్రత్యేక దృష్టి...