ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, మెహదీపట్నం, కార్వాన్, జియాగూడ, ముషీరాబాద్, బోలక్పూర్, విద్యానగర్, రాంనగర్, అడిక్మెట్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, కవాడిగూడ, దోమలగూడలో భారీ వర్షం కురిసింది.
RAINS: ఉపరితల ఆవర్తన ప్రభావం.. భాగ్యనగరంలో భారీ వర్షం
రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సాయంత్ర వేళలో మరింత ఎక్కువగా కురవడంతో .. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు.
RAINS: ఉపరితల ఆవర్తన ప్రభావం.. భాగ్యనగరంలో భారీ వర్షం
వర్షపు నీరు రహదారులపై ప్రవహించింది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో జోరుగా వానకురిసింది. ఫలితంగా ప్రజలు అవస్థలు పడ్డారు.
ఇవీచూడండి:విమానంలో నుంచి చేపల వర్షం- ఎందుకిలా?
Last Updated : Jul 14, 2021, 9:51 PM IST