కేరళ సముద్ర తీర ప్రాంతానికి చేరువలో నైరుతి రుతుపవనాలు సంచరిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఆలూరు మండలం కమ్మరచేడు వద్ద తాత్కాలిక వంతెన తెగింది. ఆదోని-ఆలూరు మధ్య రాకపోకలు నిలిచాయి.
ప్రకాశం జిల్లా దర్శిలో బుధవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పొదిలి రోడ్డులోని కాటేరు వాగు పొంగి వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరరాయం ఏర్పడింది.