ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చల్లని కబురు అందింది. రాబోయే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఏపీకి చల్లని కబురు.. రాగల 3 రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన - రాష్ట్రంలో మూడురోజుల్లో వర్షసూచనలు తాజా వార్తలు
ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని ప్రకటించింది.
![ఏపీకి చల్లని కబురు.. రాగల 3 రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన ap weather reportఏపీకి చల్లని కబురు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11523472-1097-11523472-1619262316804.jpg)
ap weather reportఏపీకి చల్లని కబురు
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో.. మరట్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి, మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక, రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి:నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములతో వర్షాలు