తెలంగాణ

telangana

ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు వర్షాలు

రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు క్యుములోనింబస్​ మేఘాల వల్ల ఇవాళ సాయంత్రం ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిజామాబాద్​ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

By

Published : Apr 15, 2020, 2:44 PM IST

Published : Apr 15, 2020, 2:44 PM IST

imd
ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు వర్షాలు

రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ 41 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఇవాళ సాయంత్రం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవీచూడండి:లాక్​డౌన్​ 2.0: ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

ABOUT THE AUTHOR

...view details