ఉత్తర అండమాన్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కోసాగుతోందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది(ap rain alert news). రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 18 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ కోస్తాంధ్ర- ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో (rains in ap news)చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(hyderabad weather report) ప్రకటించింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(rains latest news) పడతాయని తెలిపింది. కిందిస్థాయి గాలులు రాష్ట్రం వైపునకు తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు తెలిపారు. నిన్నటి అల్పపీడనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో దాని అనుబంధ ఉపరితల ఆవర్తనంతో పాటు... ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తూర్పు-మధ్య అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం వుందని వాతావరణ సంచాలకులు(hyderabad weather report) వివరించారు. తదుపరి ఇది ఇంచుమించు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్- ఉత్తర తమిళనాడు తీరం వద్దనున్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈ నెల 18న చేరే అవకాశం ఉందని వెల్లడించారు.