ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల కారణంగా హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, బేగంపేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై పూర్తిగా వర్షపు నీరు చేరింది.
వర్షం కురిసింది.. నీరు నిలిచింది
భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి వర్షం విస్తారంగా కురుస్తోంది. వర్షానికి పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షం కురిసింది.. నీరు నిలిచింది
పలువురు వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను రంగంలోకి దించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. నాలాల సమీపంలో ఉండే బస్తీ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :కరోనా సోకిన రైల్వే ఉద్యోగుల చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి