రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈరోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపారు.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ