AP Rains Today : ఉపరితల ద్రోణి ప్రభావం, వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరవ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకోవటంతో.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉదయం వాతావరణం చల్లబడటంతో పాటు 9 గంటల నుంచి వాన పడుతోంది. వర్షానికి నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి.. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
AP Rains Today: ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
AP Rains Today : ఉపరితల ద్రోణి ప్రభావం, వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగర వ్యాప్తంగా వాన పడుతోంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి వర్షం కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి.
AP Rains today
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో.. వడగండ్ల వాన పడుతుండటంతో.. పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.